హిమాయత్ సాగర్‌లో దూకి వ్యక్తి ఆత్మహత్య

బోయిన్ పల్లికి చెందిన నరేంద్ర కుమార్‌గా గుర్తింపు

రంగారెడ్డి: రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ పరిధి హిమాయత్ సాగర్‌లో దూకి ఓ వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. మృతుడు బోయిన్ పల్లికి చెందిన నరేంద్ర కుమార్‌గా గుర్తించారు. తన సొంత ఆటోలో నిన్న ఉదయం నరేంద్ర ఇంటి నుంచి బయటకు వచ్చారు. నరేంద్రకు భార్య, ఇద్దరు పిల్లలున్నారు. ఆత్మహత్యకు కుటుంబ కలహాలే కారణంగా పోలీసులు భావిస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియాకి తరలించారు.

 

మునుపటి వ్యాసం