అపజయాలు విజయాలకు బాటలు వేస్తాయి

ఇంగ్లండ్‌ మాజీ స్పిన్నర్‌ గ్రేమ్‌ స్వాన్‌

ఇంగ్లండ్: భారత్ పాకిస్థాన్ ల మధ్య టీ20 ప్రపంచకప్‌-2021 టోర్నీ నిన్న ఉత్కంఠభరితంగా సాగింది. ప్రపంచకప్‌ టోర్నీల్లో ఇప్పటి వరకు పాక్‌ చేతిలో అపజయం ఎరుగని భారత జట్టు పది వికెట్ల తేడాతో పారాజయం పాలైన విషయం తెలిసిందే. ఈ మేరకు ఇంగ్లండ్‌ మాజీ స్పిన్నర్‌ గ్రేమ్‌ స్వాన్‌ స్పందించారు. తొలి మ్యాచ్‌లో ఓటమిపాలైన భారత్ కు మేలే చేస్తుందని అన్నాడు.

అపజయాలు విజయాలకు బాటలు వేస్తాయని అభిప్రాయపడ్డాడు. ఓటమి నుంచి గుణపాఠాలు నేర్చుకుని.. పడిలేచినా కెరటంలా ముందుకు సాగే అవకాశం ఉంటుంది. ఇప్పుడే కదా ఐపీఎల్‌ ముగిసింది. టీమిండియా ఆటగాళ్లు అలసిపోయి ఉన్నారు.

అయితే, ప్రతి ఒక్కరు టీమిండియానే ఫేవరెట్‌ అంటున్నారు. వాళ్లు ఓటమి నుంచి త్వరగానే కోలుకుంటారు. ముందుకు సాగుతారు అని చెప్పుకొచ్చాడు. ఇక పాకిస్తాన్‌ ప్రదర్శన గురించి చెబుతూ... వాళ్లు చాలా చాలా ప్రమాదకరమైన టీమ్‌. అన్ని మ్యాచ్‌లలో ఓడిపోవచ్చు లేదంటే... ప్రతి మ్యాచ్‌లోనూ 10 వికెట్ల తేడాతో ప్రత్యర్థి జట్టును ఓడించనూ గలదు అని స్వాన్‌ అభిప్రాయపడ్డాడు. 

మునుపటి వ్యాసం