సీఎంగానే అసెంబ్లీలో అడుగుపెడతా: చంద్రబాబు

తెదేపా అధినేత చంద్రబాబు సంచలన నిర్ణయం

అమరావతి: తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు సంచలన నిర్ణయం తీసుకున్నారు. మళ్లీ ముఖ్యమంత్రిగానే శాసనసభలో అడుగుపెడతానని, అంతవరకు సభలో అడుగుపెట్టబోనని ఆయన స్పష్టం చేశారు. కుప్పం మున్సిపల్ ఎన్నికల ఫలితాల తర్వాత చంద్రబాబు ముఖం చూడాలనుందని సీఎం జగన్ అన్నప్పటికీ తాను పట్టించుకోలేదని చెప్పారు. సభలో ఎన్నో చర్చలను చూశామని కానీ ఇంత దారుణంగా సభ జరగడాన్ని ఎప్పుడూ చూడలేదని అన్నారు. తనను వ్యక్తిగతంగా దూషిస్తున్నారని మండిపడ్డారు.

ఏ పరువు కోసమైతే తాను తాపత్రయపడ్డానో దాన్ని దెబ్బతీసే ప్రయత్నం చేస్తున్నారని వైసీపీ నేతలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. చివరకు తన భార్య ప్రస్తావన కూడా తీసుకొస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తన కుటుంబసభ్యులను రోడ్డుపైకి లాగుతున్నారని అన్నారు. ఈ సభలో తాను ఉండలేనని మళ్లీ సీఎంగానే సభలో అడుగుపెడతానని సభలోని అందరికీ నమస్కారం చేస్తూ బయటకు వెళ్లిపోయారు. ఆయనతో పాటు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు కూడా సభ నుంచి బయటకు వచ్చేశారు.

మునుపటి వ్యాసం