సేమియాతో లడ్డు తయారీ

కావలసిన పదార్థాలు, తయారీ విధానం

కావలసిన పదార్థాలు:
సేమియా: 200 గ్రా., చక్కెర: 200 గ్రా., నెయ్యి: 100 గ్రా., యాలకులపొడి: పావు టీస్పూన్‌

తయారీ విధానం:
ముందుగా స్టవ్‌మీద వెడల్పాటి గిన్నె పెట్టుకుని, ఒక టీస్పూన్‌ నెయ్యి వేడి చేసి బంగారు రంగు వచ్చేవరకు సేమియాను చిన్నమంటపై వేయించాలి. సేమియా చల్లారాక మిక్సీలో పొడి చేయాలి. తర్వాత చక్కెర, యాలకుల పొడి జోడించి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఒక గిన్నెలో సేమియా పొడి, చక్కెర పొడి వేసి బాగా కలిపి కరిగించిన నెయ్యి వేసి లడ్డూలుగా చుట్టుకోవాలి. వేయించిన సేమ్యాలో కొంచెం చక్కెర వేసి ఈ లడ్డూలను బాగా కలిపి దొర్లించాలి. ఇష్టమైతే జీడిపప్పు, బాదం కూడా వేసుకోవచ్చు.

మునుపటి వ్యాసం