ఏపీ మంత్రులు, ఎమ్మెల్యేలకు భద్రత పెంపు

మంత్రి కొడాలినాని, ఎమ్మెల్యేలు వల్లభనేని వంశీ, అంబటి రాంబాబు, ద్వారంపూడి చంద్రశేఖర్‌లకు భద్రత

అమరావతి: జగన్ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ లో మంత్రులు, ఎమ్మెల్యేలకు భద్రత పెంచింది. కొడాలి నాని తో సహా మరో ముగ్గురు ఎమ్మెల్యేలకు భద్రత కట్టుదిట్టం చేసిన ఏపీ ప్రభుత్వం. వన్‌ ప్లస్‌ వన్‌ ఉన్న భద్రతను ఫోర్‌ ప్లస్‌ ఫోర్‌కి పెంచింది. కొడాలి నానికి టూ ప్లస్ టూ ప్లస్ కు అదనంగా వన్ ప్లస్ ఫోర్ గన్‌మెన్ల భద్రతతోపాటు ఆయన కాన్వాయ్‌లో అదనంగా మరో భద్రత వాహనాన్నికేటాయించారు. మిగిలిన ముగ్గురు ఎమ్మెల్యేలకు అదనంగా త్రీ ప్లస్ త్రీ గన్‌మెన్లతో భద్రత కల్పించారు.

చంద్రబాబుపై హాట్ కామెంట్స్ చేసిన మంత్రులకు ఎమ్మెల్యేలకు సెక్యూరిటీని పెంచింది జగన్ సర్కారు. కొడాలి నాని, వల్లభనేని వంశీ, అంబటి రాంబాబు, ద్వారంపూడి చంద్రశేఖర్‌లకు భద్రత పెంచింది అక్కడి ప్రభుత్వం. అసెంబ్లీ పరిణామాలపై సామాజిక మాధ్యమాల్లో బెదిరింపులు వచ్చాయని, ఈ నేపథ్యంలో ఫిర్యాదుల ఆధారంగా కొడాలి నాని, ముగ్గురు ఎమ్మెల్యేలకు భద్రత కల్పించినట్లు అధికారులు పేర్కొన్నారు. 

మునుపటి వ్యాసం