ఎస్సీ, ఎస్టీ, బీసీ కులాల వారికి మద్యం టెండర్లు మళ్లీ నిర్వహించాలి

గౌడ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు నాగేశ్వర్‌ గౌడ్ డిమాండ్

భద్రాద్రి కొత్తగూడెం: నగదులేక ఎంతోమంది ఎస్సీ, ఎస్టీ, బీసీ కులాల వారు మద్యం టెండర్లలో పాల్గొనలేదని వారికి ఉచితంగా టెండర్లలో పాల్గొనేలా మళ్లీ టెండర్లు  నిర్వహించాలని గౌడ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు ఆకుల నాగేశ్వర్‌ గౌడ్ డిమాండ్ చేశారు. బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ…ప్రభుత్వం ఇటీవల నిర్వహించిన లాటరీల్లో షాపుల టెండర్లలో పాల్గొనడానికి ఎస్సీ, ఎస్టీ,బీసీ కులాలకు చెందిన వారి దగ్గర నగదు లేక ఎంతోమంది టెండర్లలో పాల్గొనలేదని, వారిని దృష్టిలో ఉంచుకొని ఉచితంగా వీరికి అవకాశం కల్పించాలన్నారు.

మద్యం దుకాణాల్లో ఎమ్మార్పీ ధరలకే అమ్మకాలు జరిగేలా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. ఈ సమావేశంలో ఆదివాసీ సంఘాల రాష్ట్ర కన్వీనర్ వాసం రామకృష్ణ, లంబాడీ హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షులు రాజేష్‌నాయక్, మాదిగ దండోరా రాష్ట్ర ప్రదాన కార్యదర్సి పూసపాటి శ్రీనివాస్, మండల నాయకులు పిచ్చయ్య, మొహన్‌నాయక్, తదితరులు పాల్గొన్నారు.

మునుపటి వ్యాసం