మార్చి వ‌ర‌కూ ఉచిత రేష‌న్ బియ్యం

కేంద్ర క్యాబినెట్ బుధ‌వారం ఆమోద ముద్ర

న్యూదిల్లీ: కేంద్ర ప్రభుత్వం రేషన్ కార్డు వినియోగదారులకు శుభవార్త అందించింది. ఉచిత రేష‌న్ పథకాన్ని 2022 మార్చి వ‌ర‌కూ పొడిగించేందుకు కేంద్ర క్యాబినెట్ బుధ‌వారం ఆమోద ముద్ర వేసింది. ఈ మేరకు కేంద్ర మంత్రి కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ తెలిపారు. ఈ బియ్యం, గోధుమలు ప్ర‌ధాన మంత్రి గ‌రీబ్ క‌ళ్యాణ్ అన్న యోజ‌న(జీకేఏవై) పేరిట అందిస్తున్న విషయం తెలిసిందే.

ఈ ప‌థకం ద్వారా  80 కోట్ల మందికి జాతీయ ఆహార‌భ‌ద్ర‌త చ‌ట్టం కింద ప్ర‌భుత్వం 5 కిలోల బియ్యం, గోధుమ‌ల‌ను ఉచితంగా అంద‌జేస్తుంది. కరోనా వైరస్ మహమ్మారి క‌ట్ట‌డికి లాక్‌డౌన్‌లు విధించ‌డంతో పేద‌లు జీవ‌నోపాధిని కోల్పోయారని ఈ మేరకు కేంద్ర ప్ర‌భుత్వం గ‌త ఏడాది పీఎం-జీకేఏవైని జాతీయ ఆహార భ‌ద్ర‌త చ‌ట్టం ల‌బ్ధిదారుల కోసం ప్ర‌క‌టించింది.

మునుపటి వ్యాసం