మహబూబ్ నగర్ లో తిరస్కరణకు గురైన ఆరు నామినేషన్లు

నాలుగు ఆమోదం తెలిపినట్లు అధికారుల ప్రకటన

మహబూబ్‌నగర్‌: మహబూబ్‌నగర్‌ స్థానిక సంస్థల శాసన మండలి సభ్యుల ఎన్నికలలో ఆరు నామినేషన్లు తిరస్కరణకు గురవ్వగా, 4 నామినేషన్లు ఆమోదం పొందాయి. మహబూబ్ నగర్ స్థానిక సంస్థల శాసనమండలి సభ్యుల రెండు పదవుల ఎన్నికకు గాను మొత్తం 10 మంది అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. ఈ మేరకు జిల్లా ఎన్నికల అధికారి ఎస్.వెంకట్రావు వెల్లడించారు. ఆమోదించిన నామినేషన్లలో తెరాస అభ్యర్థులుగా పోటీ చేసిన కశిరెడ్డి నారాయణరెడ్డి, కూచుకుళ్ల దామోదర్ రెడ్డి నామినేషన్ లతోపాటు మరో ఇద్దరు స్వతంత్ర అభ్యర్థులవి ఉన్నట్లు తెలిపారు.

అవి ఫరూక్ నగర్ మండలానికి చెందిన స్వతంత్ర అభ్యర్థి కావలి శ్రీశైలం, నాగర్ కర్నూలు జిల్లా కోడేరు మండలం కొండ్రావు పల్లికి చెందిన మరో స్వతంత్ర అభ్యర్థి సుధాకర్ రెడ్డి నామినేషన్లు కూడా ఉన్నాయి. స్వతంత్ర అభ్యర్థులుగా పోటీ చేసిన సార బాయి కృష్ణ, షేక్ రహీం పాషా, మహ్మద్‌ గౌస్, సంద రేణుక, బెజ్జం మల్లికార్జునరావు, మంతటి రామాంజనేయులు నామినేషన్లను వివిధ కారణాల వల్ల తిరస్కరించినట్లు జిల్లా కలెక్టర్ వెల్లడించారు. కార్యక్రమంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్, నారాయణపేట జిల్లా అదనపు కలెక్టర్, సహాయ రిటర్నింగ్ అధికారి చంద్రారెడ్డి, వనపర్తి జిల్లా అదనపు కలెక్టర్‌, సహాయ రిటర్నింగ్ అధికారి డి. వేణుగోపాల్ తదితరులు ఉన్నారు.

మునుపటి వ్యాసం