శంషాబాద్‌ లో వరుసగా రెండో రోజు బంగారం పట్టివేత

చేతి గడియారం లోపల 233 గ్రాముల బంగారం గుర్తింపు

శంషాబాద్‌: శంషాబాద్‌ అంతర్జాతీయ విమానాశ్రయంలో వరుసగా రెండోరోజు అక్రమంగా తరలిస్తున్న బంగారం పట్టుబడింది. ఓ ప్రయాణికుడు బుధవారం షార్జా నుంచి శంషాబాద్‌ విమానాశ్రయానికి చేరుకున్నట్లు కస్టమ్స్‌ అధికారులు తెలిపారు. కస్టమ్స్‌ అధికారులు తనిఖీలు నిర్వహించగా అతడి చేతి గడియారం లోపలిభాగంలో అక్రమంగా తరలిస్తున్న 233.4గ్రాముల బంగారాన్ని గుర్తించారు.

ఈ మేరకు బంగారాన్ని సీజ్‌చేసి నిందితున్ని అరెస్టు చేశారు. పట్టుబడ్డ బంగారం విలువ రూ.11.56లక్షలు ఉంటుందని చెప్పారు. మంగళవారం దుబాయ్ నుంచి అక్రమంగా స్మగ్లింగ్ చేస్తున్న రూ.18 లక్షల విలువైన బంగారం, ఐ ఫోన్‌లను పట్టుకుని సీజ్ చేశారు. వీటిని తరలిస్తున్న ప్రయాణికుడిని అరెస్ట్ చేశారు. కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.