32 మంది భాజపా కార్పొరేటర్లపై కేసు

జీహెచ్‌ఎంసీ ఉద్యోగులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు

హైదరాబాద్‌: గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పోరేషన్ కార్యాలయంలో మంగళవారం భాజపా కార్పోరేటర్లు నిరసనకు దిగిన విషయం తెలిసిందే. జనరల్ బాడీ మీటింగ్ పెట్టి, ప్రజల సమస్యలు తీర్చాలని వారు పట్టుబట్టారు. ప్రస్తుతం ఎన్నికల కోడ్ ఉన్నందున సమావేశం నిర్వహించే వీలు లేదని అధికారులు పేర్కొన్నారు.

దీంతో ఎంత చెప్పిన భాజపా కార్యకర్తలు వినిపించుకోకపోగా నిరసనకు దిగారు దీంతో అక్కడ స్వల్ప ఉద్రిక్తత నెలకొంది. ఈ ఘటనపై కేసు నమోదయింది. 32 మంది భాజపా కార్పొరేటర్లపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఘటనపై జీహెచ్‌ఎంసీ ఉద్యోగులు  పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదయింది. జీహెచ్‌ఎంసీ సైఫాబాద్ పోలీసులు జీహెచ్‌ఎంసీలోని సీసీ ఫుటేజ్ సేకరించి, దాని ఆధారంగా కేసులు నమోదు చేశారు. మేయర్ ఛాంబర్‌లో భైఠాయించి ఆందోళన చేపట్టారు. బల్దియా ఆఫీస్‌లో మేయర్‌కు, ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళనకారులు పోస్టర్లు అంటించారు.