రేపు వరద ప్రభావిత ప్రాంతాలను పరిశీలించనున్న మాజీ సీఎం

రేపు నెల్లూరుకు చంద్రబాబు నాయుడు

నెల్లూరు: గత పది రోజులుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని వర్షాలు ముంచెత్తాయి. భారీ వర్షాలతో వాగులు, వంకలు, జలాశయాలు నిండిపోయాయి. వరదల ప్రభావంతో నెల్లూరు, చిత్తూరు జిల్లాలు అతలాకుతలమయ్యాయి. ఈ మేరకు నెల్లూరు జిల్లాలోని వరద ప్రభావిత ప్రాంతాలను మాజీ ముఖ్యమంత్రి, తెదేపా అధినేత నారా చంద్రబాబు నాయుడు గురువారం పరిశీలించనున్నారు.

మధ్యాహ్నం 12 గంటలకు ఆయన నెల్లూరు చేరుకుని ఇందుకూరుపేట, కోవూరు, నెల్లూరు సిటీ పరిధిలోని భగత్‌సింగ్‌ కాలనీ, గాంధీగిరిజన కాలనీ, జనార్ధనరెడ్డి కాలనీ తదితర ప్రాంతాల్లో పర్యటించి వరద బాధితులను పరామర్శిస్తారు. అనంతరం సాయంత్రం 6 గంటలకు రోడ్డు మార్గాన గుంటూరు బయలుదేరి వెళతారు. 

మునుపటి వ్యాసం