కాంగ్రెస్ పార్టీకి భారీ షాక్..12 మంది ఎమ్మెల్యేల రాజీనామ

మేఘాలయలో భారీ కుదుపు

12 మంది అనుచరులతో టీఎంసీలో చేరిన ముకుల్ సంగ్మా

షిల్లాంగ్: మేఘాలయలో కాంగ్రెస్ పార్టీకి భారీ షాక్ తగిలింది. కాంగ్రెస్ పార్టీకి 12 మంది ఎమ్మెల్యేలు రాజీనామా చేశారు. రాష్ట్ర అసెంబ్లీకి మొత్తం 60 సీట్లు ఉండగా కాంగ్రెస్ పార్టీకి 21 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. వారిలో 12 మంది బయటకు రాగా, మేఘాలయ రాజకీయాలు మారాయి. ఇదిలా ఉండగా, 12 మంది ఎమ్మెల్యేలు తమ పార్టీలో చేరినట్లు టీఎంసీ వర్గాలు వెల్లడించాయి.

మాజీ ముఖ్యమంత్రి ముకుల్ సంగ్మా నేతృత్వంలో టీఎంసీలో చేరినట్లు టీఎంసీ ప్రకటించింది. టీఎంసీలో చేరికపై స్పీకర్ కు లేఖ రాసినట్లు ఎమ్మెల్యేలు ప్రకటించారు. కాంగ్రెస్ అధిష్ఠానంపై ముకుల్ సంగ్మా అసంతృప్తిగా ఉన్నట్లు సమాచారం తెలుస్తోంది. ఎమ్మెల్యేలు టీఎంసీలో చేరటంతో ప్రధాన ప్రతిపక్ష పార్టీగా తృణముల్ కాంగ్రెస్ అవతరించింది. 2023 లో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో టీఎంసీ గట్టి పోటీ ఇచ్చే అవకాశం ఉన్నట్లు కనబడుతోంది. ఎమ్మెల్యేల చేరికతతో ఈశాన్య రాష్ట్రాల్లో టీఎంసీ బలోపేతంపై మమత దృష్టి సారించింది.  

మునుపటి వ్యాసం