సిద్దిపేట ప్రభుత్వ ఆసుపత్రిలో అగ్ని ప్రమాదం

తప్పిన పెను ప్రమాదం

సిద్ధిపేట: సిద్దిపేట జిల్లాలోని ప్రభుత్వ ఆసుపత్రిలో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ఆసుపత్రిలోని ఐసోలేషన్ వార్డులో అర్థరాత్రి ఒంటి గంటకు మంటలు చెలరేగాయి. షార్ట్ సర్క్యూట్ కారణంగా అర్థరాత్రి సమయంలో మంటలు రాగ, భయంతో రోగులు, ఆసుపత్రి సిబ్బంది పరుగులు తీశారు. గమనించిన ఆసుపత్రి సిబ్బంది మంటలను ఆర్పే ప్రయత్నం చేశారు.

ఐసోలేషన్ వార్డులోని వైద్య పరికరాలు, ఫర్నిచర్, వైద్య పరికరాలు, మిషనరీలు దగ్ధమైంది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ప్రభుత్వాసుపత్రికి చేరుకుని  మంటలను అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనలో ఎటువంటి ప్రాణ నష్టం జరగకపోవటంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. ప్రమాదానికి గల పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది. 

మునుపటి వ్యాసం