కాశీ దర్శనానికి మూడ్రోజుల అంతరాయం

ఈ నెల 29 నుంచి డిసెంబర్ 1 వరకు దర్శనాలు నిలిపివేత

ఉత్తరప్రదేశ్: ఉత్తర ప్రదేశ్ రాష్ట్రం వారణాసిలోని ప్రముఖ కాశీ విశ్వనాథ దేవాలయం మూడు రోజుల పాటు భక్తుల దర్శనాలకు అంతరాయం కలుగనుంది. ఈ మేరకు ఆలయంలో మూడ్రోజులపాటు దర్శనాలకు అంతరాయం ఉండనుందని ఆలయ అధికారులు తెలిపారు. నవంబర్ 29, 30 తేదీల్లో ఉదయం 6 నుంచి సాయంత్రం 6 గంటల వరకు దర్శనాలను నిలిపిచేయనున్నారు.

డిసెంబర్ 1 తెల్లవారుజాము నుంచి డిసెంబర్ 2 ఉదయం 6 గంటల వరకు పూర్తిగా దర్శనాలు నిలిపివేస్తారు. ఆలయ పునరుద్ధరణ, సుందరీకరణ, గర్భగుడిలో రాతి కట్టడం, రాతి కట్టడంపై పెయింట్ తొలగించటం, పాలిషింగ్ తదితర పనుల్లో భాగంగా దర్శనాలు నిలిపివేస్తున్నట్లు పేర్కొన్నారు. డిసెంబర్ 13 వరకు కాశీ ఆలయ విస్తరణ సుందరీకరణను పూర్తి చేసేలా చర్యలు తీసుకోనున్నట్లు వారు పేర్కొన్నారు. దీంతో భక్తుల దర్శనాలను పూర్తిగా నిలిపివేయడం ఆలయ చరిత్రలో ఇది రెండోసారి. గతంలో కరోనా నేపథ్యంలో మొదటిసారి మూసివేశారు.

మునుపటి వ్యాసం