నిరుద్యోగుల జీవితాలతో కేసీఆర్ ఆటలు: షర్మిల

ఏడేళ్లలో ఒకే ఒక్క టీఆర్టీ నోటిఫికేషన్‌

హైదరాబాద్: తెరాస ప్రభుత్వం నిరుద్యోగుల జీవితంతో ఆడుకుంటోందని వైఎస్సార్టీపీ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తెలిపారు. కేసీఆర్ ప్రభుత్వం ఏడేళ్ల పాలనలో వేసింది ఒక్క టీఆర్టీ నోటిఫికేషన్‌ మాత్రమేనని వైఎస్‌ షర్మిల అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ఉద్యోగాల భర్తీపై ఉన్న చిత్తశుద్ధికి ఇదే నిదర్శనమని విమర్శించారు. మద్యం దుకాణాల ఏర్పాటుకు పుంఖానుపుంఖాలుగా టెండర్లు జారీ అవుతున్నాయని, ఉద్యోగాల భర్తీపై మాత్రం పెదవి విప్పడం లేదని ట్విట్టర్‌ వేదికగా ఆమె ఆరోపించారు. నిరద్యోగులకు వయస్సు పరిమితి దాటిపోతున్న తరుణంలో ముఖ్యమంత్రికి సోయి లేదని మండిపడ్డారు. 

 

మునుపటి వ్యాసం