దేశంలో కొత్తగా తొమ్మిది వేల కరోనా కేసులు

మరో 396 మంది మృతి

న్యూదిల్లీ: దేశంలో కరోనా కేసులు అదుపులోనే ఉన్నాయి.  వరుసగా రెండో రోజు తొమ్మిది వేలకు పైగా కేసులు నమోదయ్యాయి. బుధవారం 11,50,538 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా వాటిలో 9,119 మందికి కరోనా పాజిటివ్ గా తేలింది. కరోనాతో బాధపడుతూ మరో 396 మంది ప్రాణాలు కోల్పోయారు. గడిచిన ఒక్క రోజు వ్యవధిలో 10,264 మంది కోలుకున్నారు.

దీంతో మొత్తం కేసుల సంఖ్య 3,45,44,882కు చేరగా, 4,66,980 మంది కన్నుమూశారు. ఇప్పటివరకు 3,39,67 మంది కరోనా నుంచి కోలుకోగా, 1,09,940 కేసులు ఇంకా యాక్టివ్‌గా ఉన్నాయని కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. యాక్టివ్‌ కేసులు 539 రోజుల కనిష్ఠానికి చేరాయని తెలిపింది. ఇప్పటివరకు రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు 132 కోట్లకుపై వ్యాక్సిన్‌ డోసులను పంపిణీ చేశామని వెల్లడించింది.

అందులో ఇంకా 22.72 కోట్ల డోసులు అందుబాటులో ఉన్నాయని, వాటిని వినియోగించాల్సి ఉందని తెలిపింది. ఒక్క కేరళలోనే 4,280 కొత్తగా కరోనా పాజిటివ్ కేసులు 308 మరణాలు సంభవించాయి. క్రియాశీల రేటు 0.32 శాతానికి తగ్గగా రికవరీ రేటు 98.33 శాతానికి పెరిగింది.