కరోనా బారి నుంచి కోలుకుంటున్న క‌మ‌ల్ హాసన్

శృతి హాసన్ ప్రకటన

చెన్నై: ప్రముఖ హీరో క‌మ‌ల్ హాస‌న్ ఇటీవ‌ల క‌రోనా బారిన ప‌డిన విషయం తెలిసిందే. ఆయన కొన్ని రోజుల క్రితం అమెరికాకు పర్యటనకు వెళ్లి వచ్చాక కరోనా పరీక్షలు చేయించుకోగా పాజిటివ్ అని తేలింది. దీంతో వెంట‌నే చెన్నైలోని ప్రైవేటు ఆసుప‌త్రిలో చేరి చికిత్స తీసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో క‌మ‌ల్ ఆరోగ్యంపై కుమార్తె హీరోయిన్ శృతి హాస‌న్ త‌న ట్విట్ట‌ర్ ద్వారా స్పందించింది.

"నా తండ్రి ప్రస్తుతం కోలుకుంటున్నాడు. త్వరలోనే మీ అందరితో మాట్లాడటానికి ఎదురుచూస్తున్నారని, ఆరోగ్యం గురించి ప్రార్ధించిన వారందరికి ధన్యవాదాలు" అంటూ ట్వీట్ చేసింది శృతి హాసన్. క‌మ‌ల్ ప్ర‌స్తుతం లోకేష్ క‌న‌గ‌రాజ్ ద‌ర్శ‌క‌త్వంలో విక్ర‌మ్ అనే సినిమా చేస్తున్నాడు. ఇదిలా ఉండగా ఆయన బిగ్ బాస్ హోస్ట్ గా ఉన్నారు. ఆరోగ్య పరిస్థితి కారణంగా ఆయన స్థానంలో శృతి హాసన్ ను తీసుకోనున్నట్లు సమాచారం.