సిక్కులపై కంగనా అనుచిత వ్యాఖ్యలు

దిల్లీ శాసనసభ ప్యానెల్ స‌మ‌న్లు

న్యూదిల్లీ: ప్రముఖ బాలీవుడ్ హీరోయిన్ కంగ‌నా ర‌నౌత్‌ ఎక్కువగా వార్తల్లో ఉంటారన్న విషయం తెలిసిందే. తాజాగా ఆమె మరో వివాదంలో చిక్కుకున్నారు. సిక్కుల‌పై అనుచిత వ్యాఖ్య‌లు చేసిన నేప‌థ్యంలో కంగ‌నాకు దిల్లీ అసెంబ్లీ ప్యానెల్ నోటీసులు జారీ చేసింది. సాగు చట్టాలను రద్దు చేయాలని కోరుతూ ఏడాది కాలంగా రైతులు చేస్తున్న నిరసనలు ఖ‌లిస్తానీ ఉద్య‌మంగా అభివ‌ర్ణిస్తూ కంగ‌నా ఆరోప‌ణ‌లు చేసింది.

అయితే ఆమె కావాల‌నే ఆ వ్యాఖ్య‌లు చేసిన‌ట్లు కేసులో ఆరోపించారు. సిక్కుల‌ను అణిచివేసింది ఒక్క ఇందిరా గాంధీ మాత్ర‌మే అని, మాజీ ప్ర‌ధాని ఇందిర దేశ విభ‌జ‌న చేయ‌కుండా సిక్కుల‌ను అడ్డుకున్న‌ట్లు ఆమె త‌న సోష‌ల్ మీడియా అకౌంట్‌లో తెలిపింది. ఇదిలా ఉండగా, ఆమ్ ఆద్మీ పార్టీ నేత రాఘ‌వ చ‌ద్దా ప్యానెల్ ముందు డిసెంబ‌ర్ ఆరో తేదీన హాజ‌రుకావాలంటూ ఆదేశించారు. సిక్కుల‌పై అనుచిత రీతిలో వ్యాఖ్య‌లు చేసిన కంగ‌నాపై ముంబయిలోనూ కేసులు న‌మోదు చేశారు. 

మునుపటి వ్యాసం