ఏపీ ప్రభుత్వం పై చిరు అసంతృప్తి

టికెట్ల విషయంలో పునరాలోచన చేయాలని విజ్ఞప్తి

హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ప్ర‌భుత్వ తీరుపై హీరో చిరంజీవి అసంతృప్తి వ్య‌క్తం చేశారు. చిత్ర ప‌రిశ్ర‌మ కోరిన విధంగా పార‌ద‌ర్శ‌క‌త కోసం ఆన్ లైన్ టికెటింగ్ బిల్ ప్ర‌వేశ‌పెట్ట‌డం హ‌ర్షించ‌ద‌గ్గ విష‌యమన్నారు. అదే విధంగా థియేట‌ర్స్ మ‌నుగ‌డ కోసం సినిమానే ఆధారంగా చేసుకున్న ఎన్నో కుటుంబాలు బ‌తువు తెరువు కోసం త‌గ్గించిన టికెట్ రేట్స్‌ని కాలానుగుణంగా, స‌ముచితంగా దేశంలోని అన్ని రాష్ట్రాల‌లో ఉన్న విధంగా నిర్ణ‌యిస్తే ప‌రిశ్ర‌మ‌కు మేలు జ‌రుగుతుందన్నారు.

దేశ‌మంతా ఒకటే జీఎస్టీ ట్యాక్స్‌లు ప్ర‌భుత్వాలు తీసుకుంటున్న‌ప్పుడు టికెట్ ధ‌ర‌ల‌లో కూడా అదే వెసులు బాటు ఉండ‌డం స‌మంజ‌సమన్నారు. ద‌య‌చేసి ఈ విష‌యంపై పున‌రాలోచించ‌డం. ప్రోత్సాహం ఉన్న‌ప్పుడే తెలుగు ప‌రిశ్ర‌మ నిల‌దొక్కుగోగ‌లుగుతుంద‌ని చిరు త‌న ట్వీట్‌లో పేర్కోన్నారు. కాగా, రోజుకి నాలుగు ఆటలు మాత్రమే, పెద్ద సినిమా చిన్న సినిమా అని తేడా లేదు అన్ని సినిమాలకు ఒకే టికెట్ రేటు మిడ్ నైట్ షోలు, బెన్‌ఫిట్ షోలు, స్పెషల్ షోలకు అనుమతి లేదని ఏపీ ప్రభుత్వం కొత్తగా తీసుకున్న నిర్ణయాల్లో ఉన్నాయి.