66 మంది వైద్య విద్యార్థులకు క‌రోనా

వీరంతా రెండు డోసుల కరోనా తీసుకున్నారని వెల్లడి

బెంగ‌ళూరు: క‌ర్ణాట‌క‌లోని ధ‌ర్వాద్‌లో క‌రోనా విజృంభించింది. తాజాగా 66 మంది వైద్య విద్యార్థులకు క‌రోనా పాజిటివ్‌గా నిర్ధార‌ణ అయింది. బాధిత విద్యార్థులంతా ఎస్‌డీఎం మెడిక‌ల్ కాలేజీకి చెందిన వారు. ఈ క్ర‌మంలో మెడిక‌ల్ కాలేజీ యాజ‌మాన్యం అప్ర‌మ‌త్త‌మైంది. విద్యార్థులు ఉంటున్న రెండు హాస్ట‌ళ్ల‌ను మూసివేశారు. కాలేజీ క్యాంప‌స్‌లో ఉన్న 400 మందికి క‌రోనా ప‌రీక్ష‌లు నిర్వ‌హిస్తున్నారు. వీరంతా రెండు డోసుల వ్యాక్సిన్ తీసుకున్నారు. అయిన‌ప్ప‌టికీ మ‌రోసారి క‌రోనా వ్యాప్తి చెంద‌డంతో ఆందోళ‌న‌కు గురవుతున్నారు. 

మునుపటి వ్యాసం