జూనియర్ ఎన్టీఆర్ పై తెదేపా నేత ఫైర్

తన వ్యాఖ్యలు వ్యక్తిగతమన్న వర్ల రామయ్య

విజయవాడ: హీరో జూనియర్ ఎన్టీఆర్ పై తెదేపా నేత వర్ల రామయ్య ఫైర్ అయ్యారు. నారా భువనేశ్వరిపై కొడాలి నాని, వల్లభనేని వంశీ విమర్శలు చేస్తే ఎన్టీయార్ స్పందించిన తీరు సరిగా లేదని వర్ల రామయ్య అభిప్రాయం వ్యక్తం చేశారు. భువనేశ్వరి మేనల్లుడిగా ఎన్టీఆర్ విఫలమయ్యారని విమర్శించారు. సినిమాల కోసం కుటుంబాన్ని, నైతిక విలువలలను వదులుకుంటారా? అని వర్ల రామయ్య ప్రశ్నించారు.

చంద్రబాబు కుటుంబానికి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు క్షమాపణ చెప్పాలంటూ వర్ల రామయ్య దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. వల్లభనేని వంశీ ఫొటోలు పెట్టినప్పుడే ఎన్టీఆర్ ఘాటుగా స్పందించి ఉంటే ఇంత జరిగేది కాదన్నారు. బూతుల మంత్రి పేర్నినానికి ఎన్టీఆర్ అంటే చాలా భయమని, అలాంటి వారిని కంట్రోల్‌ చేసే శక్తి ఆయనకే ఉందన్నారు. ఈ వ్యాఖ్యలు పూర్తిగా తన వ్యక్తిగతమని వర్ల రామయ్య ప్రకటించారు.

మునుపటి వ్యాసం