భాజపాకి తెలంగాణ రాష్ట్ర సమితి బీ పార్టీ

కేసీఆర్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసిన రాకేష్ టికాయత్

హైదరాబాద్: భాజపాకి తెలంగాణ రాష్ట్ర సమితి బీ పార్టీ అంటూ కిసాన్ సంయుక్త మోర్చా నేత రాకేష్ టికాయత్ సంచలన వ్యాఖ్యలు చేశారు. బీజేపీకి కొమ్ముకాసే ముఖ్యమంత్రి కేసీఆర్‌ ను దిల్లీకి పంపొద్దని ప్రజలకు ఆయన విజ్ఞప్తి చేశారు. సాగు చట్టాలను రద్దు చేయాలని కోరుతూ రైతులు చేస్తున్న ఉద్యమం ఏడాది అయిన సందర్భంగా నేడు హైదరాబాద్ లోని ఇందిరాపార్క్ వద్ద విపక్ష పార్టీలు మహాధర్న చేపట్టారు.

ఈ ధర్నాకు తికాయత్ ముఖ్య అతిథిగా వచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ ధాన్యం కొనుగోలు చేసే వరకు రైతులకు అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. రైతు ఉద్యమం ఒక ప్రాంతానిది కాదని, పంటల‌కు మద్దతు ధర ప్రకటించేంత వరకు ఉద్యమం కొనసాగుతుందని ఆయన స్పష్టం చేశారు. పంటకు ఎమ్ఎస్పీ గ్యారంటీ కార్డ్ వచ్చే వరకు పోరాడుతామని తికాయత్‌ హెచ్చరించారు. తెలంగాణలో ఆత్మహత్య చేసుకున్న రైతులకు నష్టపరిహారం ఇవ్వాలని తికాయత్ డిమాండ్ చేశారు. 

మునుపటి వ్యాసం