పెరుగుతో జీర్ణ సమస్యలకు చెక్

పెరుగును రోజు మన ఆహారంలో భాగం చేసుకుంటే కలిగే ప్రయోజనాలు

పెరుగు, మజ్జిగా, లస్సీ లాంటివి వేస‌విలోనే కాదు మనకు ఎల్లవేళలా మంచే చేస్తుంటాయి. ముఖ్యంగా పెరుగు, మజ్జిగా వేస‌వి కాలంలో తింటే శరీరానికి చల్లదనాన్ని ఇస్తాయి. చల్లదనమే కాకుండా శ‌రీరానికి కావ‌ల్సిన పోష‌కాలు అందిస్తుంది పెరుగు. అంతేకాకుండా ప‌లు అనారోగ్య స‌మస్యలు కూడా దూరం చేస్తుంది. ఈ క్రమంలోనే పెరుగును రోజూ మన ఆహారంలో భాగం చేసుకుంటే ఎలాంటి ప్రయోజనాలు క‌లుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం.

  • అధిక బ‌రువు త‌గ్గాల‌నుకునే వారు త‌మ ఆహారంలో పెరుగును భాగం చేసుకోవాలి.
  • పెరుగు తినడం వ‌ల్ల ర‌క్త స‌ర‌ఫ‌రా మెరుగు ప‌డుతుంది. గుండె జ‌బ్బులు రాకుండా ఉంటాయి.
  • పెరుగును రోజూ తిన‌డం వ‌ల్ల గ్యాస్‌, అసిడిటీ, మ‌ల‌బ‌ద్దకం త‌గ్గుతాయి. క‌డుపులో మంట త‌గ్గుతుంది. జీర్ణక్రియ మెరుగుపరుస్తుంది.
  • క్యాన్సర్‌ను అడ్డుకునే శ‌క్తి పెరుగులోని ఔష‌ధ గుణాల‌కు ఉంద‌ని సైంటిస్టులు చేప‌ట్టిన ప‌రిశోధ‌న‌ల్లో వెల్లడైంది.
  • పెరుగును రోజూ తిన‌డం వ‌ల్ల శ‌రీర రోగ నిరోధ‌క శ‌క్తి పెరుగుతుంది.