నిద్రకు, గుండె ఆరోగ్యానికీ దగ్గరి సంబంధం

కొలరాడో యూనివర్సిటీకి చెందిన పరిశోధకుల ప్రకటన

నిద్రించే సమయానికీ, గుండె ఆరోగ్యానికీ దగ్గరి సంబంధం ఉందని వైద్య నిపుణులు వెల్లడిస్తున్నారు. దీంతో గుండెను పదిలంగా ఉంచుకోవాలని సూచిస్తున్నారు.  తగినంత సమయం నిద్ర పోకపోయినా, అతిగా నిద్రపోయినా గుండెపోటు వచ్చే అవకాశం ఎక్కువ అవుతుందని కొలరాడో యూనివర్సిటీకి చెందిన పరిశోధకుల అధ్యయనంలో వెల్లడైంది.

జన్యుపరమైన రిస్కు ఉండి, ఆరు గంటల కన్నా తక్కువగా, 9 గంటలకు పైబడి నిద్ర ఉన్నా గుండెను రిస్క్‌లో పడేస్తున్నట్లేనని అధ్యయనకారులు వెల్లడిస్తున్నారు. 6 నుంచి 9 గంటల నిద్ర పాటించే వాళ్లలో జన్యుపరమైన రిస్కు ఉన్నప్పటికీ గుండెపోట్లు వచ్చే ఆస్కారం 18 శాతం తగ్గుతుందంటున్నారు. ఈ అధ్యయనం నిర్వహించిన ప్రొఫెసర్‌ సెలీన్‌ వెట్టర్‌. అయితే, నిద్ర గుండె ఆరోగ్యంపై ప్రభావం చూపడం వెనుక గల కారణాలను మరింత లోతుగా అధ్యయనం చేయాల్సి ఉందని వారు పేర్కొన్నారు.