తాగుబోతుల సంఘం అంతా కలిసి దిల్లీ వెళ్లారు

కేసీఆర్ పై ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి ఫైర్

జగిత్యాల: తాగుబోతుల సంఘం అంతా కలిసి దిల్లీ వెళ్లారని ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి ఆరోపించారు. ధాన్యం కొనుగోలు చేయాలని కోరుతూ కలెక్టరేట్‌ ఎదుట కాంగ్రెస్‌ పార్టీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ముఖ్యమంత్రి కేసీఆర్‌పై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. మోదీ మెడలు వంచుతానని దిల్లీ వెళ్లిన కేసీఆర్ మెడలు వంచుకున్నారన్నారు. కొప్పుల ఈశ్వర్‌కు ఎన్నికలపై ఉన్న శ్రద్ధ రైతుల మీద లేదన్నారు. ప్రభుత్వ అధికారులకు మిల్లర్లకు ఏజెంట్లుగా మారారన్నారు.