పంట కొనుగోలుకు ఆధార్‌ ధ్రువీకరణ తప్పనిసరి

జిల్లా అదనపు కలెక్టర్ రఘురాం శర్మ

జోగులాంబ గద్వాల: పంట కొనుగోలుకు ఆధార్ ఆధారిత ఓటీపీ ధ్రువీకరణ తప్పనిసరి అని జోగులాంబ గద్వాల జిల్లా అదనపు కలెక్టర్ రఘురాం శర్మ తెలిపారు. గద్వాల మండల పరిధిలోని  లత్తిపురం, బిరెల్లి, బసాపురం, అనంతపురం, తుర్కోనిపల్లి, ములకలపల్లి, తెలుగోని పల్లి గ్రామాల్లో ఐకెపి ఆధ్వర్యంలో కొనసాగే వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను జాయింట్ కలెక్టర్ రఘురాం శర్మ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ. వడ్లు బాగా ఆరబెట్టి 17శాతం లోపు తేమ ఉండేలా చూడాలన్నారు.

అదేవిధంగా రైతులు తమ దగ్గరలో ఉన్న పోస్టాఫీసు లేదా పోస్ట్ మ్యాన్ వద్దనే ఆధార్ కార్డుకు మొబైల్ నెంబర్ లింక్ చేసుకోవచ్చని సూచించారు. అలాగే ధాన్యం కొనుగోలు సమయంలో సంబంధిత రైతు సెల్ ఫోన్ కు ఓటీపీ వస్తుందన్నారు. కొనుగోలు కేంద్రాల వద్ద రైతులకు ఇబ్బందులు లేకుండా నిర్వాహకులు వసతులు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఎంపీటీసీలు రాధ, అయ్యన్న, నాయకులు రమేష్ నాయుడు, జయరాం రెడ్డి, కురుమన్న, వెంకటరామ్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, కార్యక్రమంలో సర్పంచులు గీత, మన్నెమ్మ జయమ్మ తదితరులు పాల్గొన్నారు.