తీవ్ర విషాదంలో హీరో కిరణ్ కుటుంబం

రోడ్డు ప్రమాదంలో సోదరుడు మృతి

కడప: యువ హీరో కిరణ్ అబ్బవరం కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. దీంతో టాలీవుడ్ మరోసారి దిగ్భ్రాంతికి గురైంది. నటుడు కిరణ్ సోదరుడు రామానుజులు రెడ్డి బుధవారం కడప జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో కన్నుమూశాడు. ఇవాళ కడప జిల్లా చెన్నూరు వద్ద రోడ్డు ప్రమాదంతో రామానుజులు రెడ్డి దుర్మరణం పాలయ్యాడు.

ఇప్పుడిప్పుడే సినీ పరిశ్రమలో అడుగుపెట్టి ఎదుగుతున్న తరుణంలో సోదరుడి మరణం కిరణ్ ను తీవ్ర విషాదానికి గురిచేసింది. 'రాజావారు రాణిగారు', 'ఎస్ఆర్ కల్యాణమండపం' వంటి చిత్రాలతో కిరణ్ అబ్బవరం నటుడిగా గుర్తింపు అందుకున్నాడు. గత కొన్ని రోజుల నుంచి వరుస మరణాలు టాలీవుడ్ ను విషాదంలో ముంచుతున్నాయి. సీనియర్ కొరియోగ్రాఫర్ శివశంకర్ మాస్టర్ కరోనా బారినపడి మరణించగా, ప్రఖ్యాత గీత రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి తీవ్ర అనారోగ్యంతో కన్నుమూశారు. ఇవాళ సిరివెన్నల గారి అంత్యక్రియలు మహాప్రస్థానంలో జరిగాయి. 

మునుపటి వ్యాసం