వరదబాధితులకు జూనియర్ ఎన్టీఆర్‌ భారీ విరాళం

నావంతు చిన్న సాయమని వెల్లడి

అమరావతి: ప్రముఖ నటుడు, హీరో జూనియర్ ఎన్టీఆర్ తన మంచి మనసును మరోసారి చాటుకున్నారు. వరద బాధితులకు భారీ విరాళాన్ని ప్రకటించారు. వరద బాధితుల కష్టాలు చూసి చలించిపోయానని అన్నారు. బాధితులు కోలుకునేందుకు నావంతు చిన్న సాయమని బుధవారం తన ట్విట్టర్‌లో వెల్లడించారు.వర్షప్రభావంతో నష్టపోయిన బాధితులకు ప్రముఖ సినీనటుడు జూనియర్‌ ఎన్టీఆర్‌ రూ.25లక్షల విరాళం అందిచనున్నామన్నారు.దాదాపు పదిరోజుల పాటు నెల్లూరు, కడప, చిత్తూరు, అనంతపురం జిల్లాలో భారీ వర్షాలు కురిసాయి. వరదలతో తీవ్ర నష్టం జరిగింది. పంటలు దెబ్బతిన్నాయి. ఆస్తి, ప్రాణ నష్టం జరిగిన విషయం తెలిసిందే.

మునుపటి వ్యాసం