సులభంగా...సొరకాయ సూప్‌

తయారీ విధానం, కావాలసిన పదార్థాలు

కావలసిన పదార్థాలు: మిరియాల పొడి- అర స్పూను, సొరకాయ- ఒకటి, ఉల్లి- రెండు, వెల్లుల్లి ముక్కలు- స్పూను, చీజ్‌ క్రీమ్‌- మూడు స్పూన్లు, బటర్‌-  మూడు స్పూన్లు, ఉప్పు, నీళ్లు - తగినంత.

తయారీ విధానం: చెక్కుతీసిన సొరకాయ ముక్కలు, ఉల్లి, వెల్లుల్ని ముక్కల్ని కూడా  ఓ పాన్‌లో వేసి ఉడికించాలి. చల్లారాక వీటిని మెత్తగా రుబ్బి పక్కన పెట్టుకోవాలి. మరో పాన్‌లో బటర్‌ వేసి, కాగాక ప్యూరీ, మిరియాల పొడి, ఉప్పు వేసి అయిదు నిమిషాలు ఉడికించాలి. పొయ్యి కట్టేసే ముందు చీజ్‌ క్రీమ్‌ కలిపితే సోరకాయ సూప్‌ రెడీ. పుదీనా, తులసి ఆకుల్ని పైన అలంకరించవచ్చు.