ఎస్‌బీఐ బ్యాంకు పేరుతో నకిలీ కాల్ సెంటర్ గుట్టు రట్టు

14 మంది అరెస్ట్ .. 209 కేసుల్లో నిందితులు

హైదరాబాద్: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్యాంకు పేరుతో నకిలీ కాల్ సెంటర్ నడుపుతున్న ముఠా  గుట్టుని పోలీసులు రట్టు చేశారు హైదరాబాద్‌ పోలీసులు తెలిపిన కథనం ప్రకారం.. కొందరు వ్యక్తులు దిల్లీ కేంద్రంగా నగరంలో ఎస్‌బిఐ బ్యాంకు పేరుతో ఎస్బీఐ ధనీ బజార్, ద లోన్ ఇండియా, లోన్ బజార్ తదితర పేర్లతో కాల్ సెంటర్లు నడుపుతున్నారు.

దీంతో  కోట్ల రూపాయల నగదును దండుకుంటున్నారు. ఈ సమాచారం తెలుసుకున్న సైబరాబాద్ సైబర్ క్రైం పోలీసులు దీనికి సంబంధించి 14 మందిని అరెస్ట్ చేశారు. అనంతరం కాల్ సెంటర్‌ ఖాతాల్లోని లక్షల రూపాయల నగదు నిలుపుదల చేశారు. విచారణలో ఈ ముఠా సభ్యులు దేశ వ్యాప్తంగా 209 కేసుల్లో నిందితులుగా ఉన్నట్లు పోలీసులు గుర్తించారు.

సైబరాబాద్ సీపీ స్టీఫెన్ రవీంద్ర మాట్లాడుతూ... స్ఫూఫింగ్ యాప్ ద్వారా ఎస్బీఐ అసలైన కస్టమర్ కేర్ నుంచే ఫోన్ చేసినట్లు నమ్మించి మోసాలకు పాల్పడుతున్నారు. దిల్లీలోని ఉత్తమ్ నగర్ లో కాల్ సెంటర్ ఏర్పాటు చేసి, దేశ వ్యాప్తంగా 33 వేల కాల్స్ చేసి రూ. కోట్లు కాజేసినట్లు వారు గుర్తించారు. ఈ కేసులో ప్రధాన నిందితుడు అభిషేక్ మిశ్రా నకిలీ యాప్ తయారు చేసి మోసాలకు పాల్పడుతున్నట్లు సీపీ వివరించారు. రుణం మంజూరు కోసం ప్రాసెసింగ్ ఫీజు అధిక మొత్తంలో వసూలు చేస్తారని తెలిపారు. 

మునుపటి వ్యాసం