ఒమిక్రాన్​ ​పై ప్రభావవంతంగా కోవాగ్జిన్.!

మరికొంత పరిశోధన అవసరమన్న నిపుణులు

హైదరాబాద్: దక్షిణాఫ్రికాలో బయటపడ్డ కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ ప్రపంచ వ్యాప్తంగా తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది. ఇప్పటికే 29 దేశాలకు పాకిన ఈ వైరస్ మన దేశంలోకి కూడా ప్రవేశించింది. బెంగళూరులో రెండు ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. సౌతాఫ్రికా నుంచి వచ్చిన ఇద్దరికి, మహారాష్ట్రలో 28 మందికి, దిల్లీలో 12 మందికి సోకినట్లు అనుమానిస్తున్నారు.

వారి నమూనాలను ఒమిక్రాన్ నిర్ధారణకు పంపారు. రెండు డోసుల వ్యాక్సిన్ తీసుకున్నప్పటికీ ఒమిక్రాన్ సోకుతుందనే వార్తలు ప్రజలను మరింత భయబ్రాంతులకు గురిచేస్తున్నాయి. దీంతో ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్ఛ్ (ఐసీఎంఆర్) హైదరాబాద్లోని భారత్ బయోటెక్ తయారు చేసిన 'కోవాగ్జిన్' ఒమిక్రాన్ కు  వ్యతిరేకంగా ప్రభావవంతంగా పనిచేస్తుందని ప్రకటించింది.

కోవాగ్జిన్ టీకా ఆల్ఫా, బీటా, గామా, డెల్టా వంటి ఇతర వేరియంట్లపై కూడా బాగా పనిచేస్తుందని ఆయన పేర్కొన్నారు. అయితే, ఒమిక్రాన్ పై ఎంత ప్రభావవంతంగా పనిచేస్తుందో తెలుసుకునేందుకు మరిన్ని నమూనాలను స్వీకరించి పరీక్షించాల్సి ఉందని, అప్పుడే మరింత స్పష్టత వస్తుందని తెలిపారు. అందుబాటులో ఉన్న ఇతర వ్యాక్సిన్లతో పోలిస్తే ఒమిక్రాన్‌కు వ్యతిరేకంగా కోవాగ్జిన్ మరింత ప్రభావవంతంగా పనిచేస్తుందని స్పష్టం చేసింది. 

మునుపటి వ్యాసం