చెన్నూరు ఎమ్మెల్యే బాల్క సుమన్ పై ఉన్న కేసు కొట్టివేత

రాజారాం యాదవ్ కు కూడా కేసు నుంచి ఊరట

హైదరాబాద్‌: ప్రభుత్వ విప్, చెన్నూరు ఎమ్మెల్యే బాల్క సుమన్, తెరాస నేత రాజారాం యాదవ్ పై ఉన్న తెలంగాణ ఉద్యమ కేసులను నాంపల్లి ప్రజాప్రతినిధుల ప్రత్యేక కోర్ట్‌ న్యాయమూర్తి కె.జయకుమార్ కొట్టివేశారు. న్యాయవాది జక్కుల లక్ష్మణ్ తెలిపిన వివరాల ప్రకారం.. 2009 లాలాగుడ పోలీస్ స్టేషన్ పరిధి తార్నాకలో ఉస్మానియా విశ్వవిద్యాలయ విద్యార్థి నేతలు బాల్క సుమన్, రాజారాం యాదవ్ తదితరులు తెలంగాణ బంద్ సందర్భంగా నినాదాలు చేస్తూ పెట్రోల్ పంపులో అద్దాలు పగలగొట్టారన్నారు. ఈ మేరకు లాలాగూడ పోలీస్ స్టేషన్ లో నమోదైన కేసుని న్యాయమూర్తి విచారించారు.