నలభై ఏళ్లు పై బడిన వాళ్ల‌కు బూస్ట‌ర్ డోసు

జీనోమ్ ప‌రిశోధ‌నల‌ గ్రూపు ఇన్‌సాకాగ్

న్యూదిల్లీ: క‌రోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ ప్రపంచ వ్యాప్తంగా కలకలం రేపుతోంది. అయితే నలభై ఏళ్ల వ‌య‌సు పైబడిన వారికి బూస్ట‌ర్ డోసు టీకాలు ఇవ్వాల‌ని జీనోమ్ ప‌రిశోధ‌నల‌ గ్రూపు ఇన్‌సాకాగ్ కేంద్రానికి సూచించింది. త‌న వీక్లీ బులిటెన్‌లో ఇన్‌సాకాగ్ ఈ సిఫార‌సు చేసింది. వ్యాక్సిన్ వేసుకోని వారికి ముందుగా టీకాలు ఇవ్వాల‌ని, ఆ త‌ర్వాత 40 ఏళ్లు ఉన్న‌వాళ్ల‌కు, దాటిన‌వాళ్ల‌కు కోవిడ్ బూస్ట‌ర్ డోసు టీకాలు ఇవ్వాల‌ని ఇన్‌సాకాగ్ తెలిపింది.

ప్రమాదం ఎక్కువ ముందుగా వ్యాక్సిన్ ఇవ్వాల‌ని, ఇప్పుడున్న టీకాలలో త‌క్కువ స్థాయి యాంటీబాడీలు ఉన్నాయ‌ని, వాటితో ఒమిక్రాన్‌ను నిర్వీర్యం చేయ‌డం కుద‌ర‌ద‌ని, అందుకే బూస్ట‌ర్ డోసు త‌ప్ప‌నిస‌రి అని ఇన్‌సాకాగ్ తెలిపింది. ఇదిలా ఉండగా, క‌రోనా వైర‌స్‌లో జ‌రుగుతున్న జ‌న్యు ప‌రిణామాల‌ను ప‌రిశీలిచేందుకు 28 ప‌రిశోధ‌న‌శాల‌ల‌తో కూడిన‌ క‌న్సార్టియం ఏర్ప‌డిన విష‌యం తెలిసిందే.

మునుపటి వ్యాసం