కొవిడ్ నిబంధనలతో ఏ వేరియంట్ దరిచేరదు: మంత్రి హ‌రీశ్‌రావు

టీకాలు ప్రతి ఒక్కరు వేసుకోవాలని సూచన

హైద‌రాబాద్: క‌రోనా నిబంధ‌న‌లు విధిగా పాటిస్తే డెల్టా, ఆల్ఫా, ఒమిక్రాన్ వేరియంట్ ఏది కూడా మ‌న ద‌రి చేర‌దని ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు తెలిపారు. హైదరాబాద్ నగరంలోని ఓల్డ్ బోయిన్‌ప‌ల్లిలో బ‌స్తీ ద‌వాఖానాను మంత్రి ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ... టీకాలు సుర‌క్షిత‌మైన‌వి. అనుమానాలు, అపోహాలు అవ‌స‌రం లేదు. రెండు డోసులు తీసుకుంటే మ‌న ప్రాణాల‌ను కాపాడుకోవ‌చ్చు. కొంచెం జాగ్ర‌త్త ఉంటే క‌రోనాను, ఒమిక్రాన్ ను దరిచేరకుండా చేసుకోవచ్చన్నారు. తెలంగాణ వ్యాప్తంగా 2 కోట్ల 51 ల‌క్ష‌ల మంది మొద‌టి డోసు తీసుకున్నారు. 

రెండో డోసు కోటి 30 ల‌క్ష‌ల మంది మాత్ర‌మే తీసుకున్నారు. చాలా మంది రెండో డోసు తీసుకోలేదు. ఈ సంఖ్య పెర‌గాల్సిన అవ‌స‌రం ఉంద‌న్నారు. 18 ఏండ్లు దాటి ప్ర‌తిన ఒక్క‌రూ రెండు డోసులు తీసుకోవాలి. టీకాలు వేసేందుకు ఆరోగ్య కార్య‌క‌ర్త‌లు ఎంతో కృషి చేస్తున్నారు. వారికి అభినంద‌న‌లు తెలియ‌జేస్తున్నాను అని హ‌రీశ్‌రావు పేర్కొన్నారు.

మ‌న హైద‌రాబాద్‌లో, తెలంగాణ‌లో దేవుని ద‌య‌వ‌ల్ల రాలేదు. బ్రిట‌న్ నుంచి వ‌చ్చిన మ‌హిళ‌కు క‌రోనా పాజిటివ్ వ‌చ్చింది. ఆమె శాంపిళ్ల‌ను జీనోమ్ సీక్వెన్సింగ్‌కు పంపించాం. నాలుగైదు రోజుల్లో ఆమెకు ఏ వేరియంట్ సోకింది అనేది తెలుస్తుంది. మాస్కు ధ‌రించండి.. టీకాలు వేసుకోండి.. చేతులు శుభ్రంగా క‌డుక్కోవాలని ఆయన సూచించారు. 

మునుపటి వ్యాసం