షాద్‌నగర్‌ లో వ్యక్తి దారుణ హత్య

అక్రమ సంబంధం వ్యవహారంలో దుండగులు హత్య చేసినట్లు అనుమానిస్తున్న పోలీసులు

మహబూబ్ నగర్: గుర్తు తెలియని దుండగుల దాడిలో వ్యక్తి దారుణ హత్యకు గురైన సంఘటన షాద్‌నగర్‌ పట్టణంలోని పటేల్‌ రోడ్డులో చోటు చేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం.. పటేల్‌ రోడ్డులోని శారద అనే మహిళకు చెందిన ఇంటి ఆవరణలో ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం కర్నూల్‌కు చెందిన నాగరాజు (36) అనే వ్యక్తిని గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేశారు.

స్థానికులు అందించిన సమాచారంతో విషయం తెలుసుకున్న షాద్‌నగర్‌ పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం స్థానిక దవాఖానకు తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. కాగా, నాగరాజు స్థానికంగా నివాసం ఉండే ఓ మహిళతో అక్రమ సంబంధం కొనసాగించేవాడని, ఈ నేపథ్యంలోనే ఆ మహిళ కుటుంబీకులు హత్యకు పాల్పడి ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. ఇప్పటికే పలువురిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.

మునుపటి వ్యాసం