తెలంగాణలో కరోనాతో ఇద్దరు మృతి

198 పాజిటివ్ కరోనా కేసులు

హైదరాబాద్: రాష్ట్రంలో కరోనా వ్యాప్తి అదుపులోనే ఉంది. గడిచిన 24 గంటల వ్యవధిలో 198 కరోనా బారిన పడ్డారు. కాగా, కరోనాతో బాధ పడుతూ ఇద్దరు కన్ను మూశారు. కరోనా నుంచి మరో 153 మంది బాధితులు కోలుకున్నారు. ప్రస్తుతం తెలంగాణలో 3,723 యాక్టివ్ కేసులు ఉన్నాయి. విదేశాల నుంచి ఇప్పటి వరకు రాష్ట్రానికి 909 మంది రాగా, ఇవాళ ఒక్కరోజే 209 మంది రాష్ట్రానికి చేరుకున్నారు. వీరిలో 9 మందికి కరోనా నిర్ధారణ అయింది. ఇప్పటివరకు 13 మందికి విదేశాల నుంచి వచ్చిన వారికి సోకగా, 13మంది శాంపిల్స్ జీనోమ్ సీక్వెన్సింగ్‌కు అధికారులు పంపినట్లు సమాచారం. 

మునుపటి వ్యాసం