మాజీ ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్య మృతి

పల్స్ పడిపోవటంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ అస్తమయం

హైదరాబాద్: ప్రముఖ నాయకుడు, మాజీ ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్య(88) కన్నుమూశారు. శనివారం ఉదయం తన నివాసంలో పల్స్ పడిపోవటంతో కుటుంబసభ్యులు ఆయనను హైదరాబాద్ స్టార్ ఆసుపత్రిలో చేర్పించారు. అక్కడ ఆయన చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. రాజకీయ కురువృద్ధుడు అయినటువంటి కొణిజేటి రోశయ్య 1933, జూలై4 వ తారీఖున గుంటూరు జిల్లా వేమూరులో జన్మించారు.

అదే జిల్లాలో హిందూ కళాశాలలో కామర్స్ పూర్తి చేశారు. 1968లో తొలిసారిగా శాసనమండలికి ఎన్నికయ్యారు. కాంగ్రెస్ పార్టీ తరఫున 1968,1974, 1980లలో శాసనమండలి సభ్యునిగా ఉన్నారు. చివరిసారిగా 12వ శాసనసభకు చీరాల నుంచి ఎన్నికయ్యారు. 2009 నుంచి ప్రత్యక్ష ఎన్నికల్లో రాకుండా ఎమ్మెల్సీగా కొనసాగారు.