మేడారం భక్తులకు బస్సు సర్వీసుల ప్రారంభం

ఫిబ్రవరి 16 నుంచి 19 వరకు జాతర

వరంగల్: తెలంగాణ కుంభమేళాగా పేరుగాంచిన మేడారం జాతర ఫిబ్రవరి 16 నుంచి ప్రారంభంకానుంది. ఈ జాతర వెళ్లే భక్తుల కోసం ఆర్టీసీ శుభవార్త అందించింది. నేటి నుంచి  ఆర్టీసీ బస్సు సర్వీసులను ప్రారంభించింది. హన్మకొండ బస్టాండ్ నుంచి మేడారం జాతరకు ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసింది. హన్మకొండ బస్టాండ్ నుంచి మేడారానికి పెద్దలకు రూ. 125, పిల్లలకు రూ.65 చార్జీలుగా ఆర్టీసీ నిర్ణయించింది.

మేడారం జాతర కోసం ఆర్టీసీ ప్రత్యేకంగా 3,845 బస్సులను నడుపనుంది. కాగా, ఈ జాతర ఫిబ్రవరి 16 నుంచి 19 వరకు జరగనున్న నేపథ్యంలో ప్రభుత్వం ఇప్పటికే అన్ని ఏర్పాట్లను పూర్తి చేయాలని నిర్ణయించుకుంది. దేశవ్యాప్తంగా లక్షలాది మంది భక్తులు మేడారం జాతరకు తరలివచ్చి అమవార్లను దర్శించుకోనున్నారు. 

మునుపటి వ్యాసం