భారీగా కొమురవెల్లి ఆలయ బుకింగ్‌ ఆదాయం

రూ.27.50 లక్షలకు చేరినట్లు ఆలయ వర్గాల ప్రకటన

చేర్యాల: కొమురవెల్లి మల్లికార్జునస్వామి ఆలయ సందర్శనానికి భక్తులు భారీగా తరలివస్తున్నారు. ఈనేపథ్యంలో ఆదివారం భారీగా భక్తులు తరలివచ్చి మొక్కుబడులు చెల్లించుకున్నారు.  దీంతో రూ.27.50 లక్షల ఆదాయం సమకూరినట్లు ఆలయ అధికారులు తెలిపారు. ఈ ఆదాయంలో భక్తులు సమర్పించిన తలనీలాలు, పట్నాలు, బోనాలు, నిర్వహించిన ఆర్జిత సేవలు, వసతీ గదుల అద్దె, ప్రసాద విక్రయాలతో శనివారం రూ.2.70 లక్షలు, ఆదివారం రూ.24.74 లక్షల మేర ఆదాయం వచ్చినట్లు ఆలయ వర్గాలు పేర్కొన్నాయి. కొద్దిరోజులక్రితం నిర్వహించిన స్వామివారి కల్యాణంతో బ్రహ్మోత్సవాలు ప్రారంభంకావడంతో పాటు సంక్రాంతి సెలవులు రావడంతో ఈ ఆదివారం మల్లన్న క్షేత్రానికి భక్తులు అధిక సంఖ్యలో తరలివస్తున్నారన్నారు. 

మునుపటి వ్యాసం