భారత మార్కెట్లోకి శామ్ సంగ్ ఏ8 ట్యాబ్

ధర రూ.18 వేల నుంచి మొదలు

న్యూదిల్లీ: కొత్త డిజైన్, పెద్ద స్క్రీన్, అధిక బ్యాటరీ సామర్థ్యంతోపాటు మరిన్ని అద్భుతమైన ఫీచర్లను అందుబాటులోకి తెచ్చింది శామ్ సంగ్. ఈ కంపెనీ తాజాగా గెలాక్సీ ట్యాబ్ ఏ8 ను భారత మార్కెట్లోకి ప్రవేశపెట్టింది. కాగా, కరోనా సమయంలో ఆన్ లైన్ క్లాస్ లకు అధిక ప్రాధాన్యత ఇస్తున్న క్రమంలో ఈ ట్యాబ్ బాగా ఉపయోగపడగలదని శామ్ సంగ్ అధికారులు స్పష్టం చేస్తున్నారు.

ఫీచర్ల విషయానికి వస్తే...శామ్ సంగ్ ట్యాబ్ ఏ8 3జీబీ ర్యామ్, 32 జీబీ స్టోరేజీ రకం ధర రూ.17,999. ఇందులో సిమ్ ట్రే సదుపాయం ఉండదు. వైఫై ఎనేబుల్డ్. ఇందులోనే 4జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజీ ధర రూ.19,999. ఇక ఎల్టీఈ సిమ్ ను సపోర్ట్ చేసే ట్యాబ్ ఏ8 3జీబీ, 32జీబీ స్టోరేజీ ధర రూ.21.999. ఇందులోనే 4జీబీ ర్యామ్, 64జీబీ స్టోరేజీ ధర రూ.23,999. ఐసీఐసీఐ డెబిట్, క్రెడిట్ కార్డులతో చెల్లింపులు చేస్తే రూ.2,000 క్యాష్ బ్యాక్ ఇస్తున్నట్టు కంపెనీ తెలిపింది. బుక్ కవర్ ను రూ.999కే పొందొచ్చని పేర్కొంది.

10.5 అంగుళాల టీఎఫ్ టీ డిస్ ప్లే, స్లిమ్ బెజెల్స్ 16:10 యాస్పెక్ట్ రేషియోతో ఉంటుంది. డాల్బీ ఆటమ్స్ క్వాడ్ స్పీకర్ ఉంటుంది. 7,040 ఎంఏహెచ్ బ్యాటరీ, 15 వాట్ ఫాస్ట్ చార్జింగ్ ను సపోర్ట్ చేస్తుంది. వెనుక భాగంలో 8 మెగాపిక్సల్, ముందు భాగంలో 5 మెగాపిక్సల్ కెమెరాలు ఉంటాయి. ఇందులో యూనిసాక్ టైగర్ టీ618 ప్రాసెసర్ ఉంటుంది. స్క్రీన్ రికార్డర్ సదుపాయం కూడా ఉంది. ఏదైనా నచ్చిన కార్యక్రమాన్ని రికార్డు చేసుకోవచ్చు. 

మునుపటి వ్యాసం