బ్యాడ్మింటన్ స్టార్ ప్లేయర్ కిదాంబి శ్రీకాంత్ కు కరోనా

మరో ఆరుగురు క్రీడాకారులకు పాజిటివ్

హైదరాబాద్: ప్రపంచ మాజీ ఛాంపియన్ భారత బ్యాడ్మింటన్ స్టార్ ప్లేయర్ కిదాంబి శ్రీకాంత్ కరోనా బారిన పడ్డారు. ఆయనతోపాటు మరో ఆరుగురు బ్యాడ్మింటన్ ఆటగాళ్లకు కరోనా సోకింది. వీరందరూ ప్రస్తుతం ఐసొలేషన్ లో ఉన్నారని ప్రపంచ బ్యాడ్మింటన్ ఫెడరేషన్ (బీడబ్ల్యూఎఫ్) ఒక ప్రకటనలో వెల్లడించింది.

కిదాంబి శ్రీకాంత్ తోపాటు అశ్వని పొన్నప్ప, రితికా రాహుల్ థక్కర్, సిమ్రన్ అమాన్ సింఘీ, మిథున్ మంజునాథ్,కుషి గుప్తా, ట్రెస్సా జోలి తదితరులు కరోనా బారిన పడి ఐసొలేషన్ లో ఉన్నారని బీడబ్ల్యూఎఫ్ తెలిపింది. ఒకేసారి ఏడుగురు ఆటగాళ్లకు కరోనా సోకడంతో ఇండియా ఓపెన్ టోర్నీలో కలకలం రేపింది. 

మునుపటి వ్యాసం