పంజాబ్ ముఖ్యమంత్రి అభ్యర్థిని ప్రకటించిన ఆప్ పార్టీ

సీనియర్ లీడర్ భగవంత్ మన్ పేరును ప్రకటించిన కేజ్రీవాల్

న్యూదిల్లీ: పంజాబ్ శాసన సభ ఎన్నికలు మరికొన్ని రోజుల్లో జరగనున్న విషయం తెలిసిందే. ఈ ఎన్నికల్లో ఎలాగైనా గెలిచి తమ పార్టీని నిలబెట్టుకోవాలనుకుంటున్న ఆమ్ ఆద్మీ పార్టీ గట్టి ప్రయత్నమే చేస్తోంది. ఇదిలా ఉండగా  పంజాబ్ ముఖ్యమంత్రి అభ్యర్థిపై పార్టీ జాతీయ కన్వీనర్, దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ స్పష్టతనిచ్చారు.

పంజాబ్ లో తమ పార్టీ సీనియర్ లీడర్ భగవంత్ మన్ పంజాబ్ ఆమ్ ఆద్మీ పార్టీ ముఖ్యమంత్రి అభ్యర్థి అని చెప్పారు. ఈ సందర్భంగా అరవింద్ కేజ్రీవాల్ మాట్లాడుతూ...భగవంత్ మన్ తనకు సోదరుడు లాంటి వారని పంజాబ్ ప్రజలు కోరుకున్న విధంగానే నిర్ణయం తీసుకున్నామన్నారు కేజ్రీవాల్. పంజాబ్ లో మొత్తం 117 స్థానాలున్న ఒకే విడతలో పోలింగ్ నిర్వహించనున్నారు. పాకిస్థాన్ సరిహద్దు రాష్ట్రం కావడంతో ఇక్కడ ఎన్నికలు ప్రతిష్ఠాత్మకంగా ఉంటాయన్న విషయం తెలిసిందే. గత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 77 సీట్లు సాధించి పదేళ్ల తర్వాత తిరిగి అక్కడ అధికారం చేపట్టింది.

మునుపటి వ్యాసం