కాంగ్రెస్ సభ్యత్వం తీసుకుంటే బీమా: రేవంత్ రెడ్డి

30 లక్షల సభ్యత్వ నమోదుకు కాంగ్రెస్ టార్గెట్

హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీలో చేరే వారికి రూ.2 లక్షల భీమా సదుపాయం కల్పిస్తూ ఆ పార్టీ నిర్ణయం తీసుకుంది. న్యూ ఇండియా ఇన్సూరెన్స్ కంపెనీ ప్రతినిధులు పీసీసీ రేవంత్ సమక్షంలో ఒప్పందం కుదుర్చుకున్నారు. ఈ సందర్భంగా పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి మాట్లాడుతూ... 30 లక్షలకు పైగా సభ్యత్వం టార్గెట్‌గా పెట్టుకున్న కాంగ్రెస్ ఇప్పటికి 7 లక్షల సభ్యత్వాలు నమోదయ్యాయన్నారు.

కాంగ్రెస్ పార్టీలో చేరే సభ్యులకు ఒక రక్షణ కల్పించడం కోసం దేశంలో తొలిసారిగా రెండు లక్షల ప్రమాద బీమా కల్పిస్తున్నామని రేవంత్ తెలిపారు. ఒకటి ఏప్రిల్ 2022 నుంచి మార్చి 31, 2023 వరకు ప్రమాద బీమాతో కూడా సభ్యత్వం ఉంటుందని వెల్లడించారు. సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని గతేడాది డిసెంబర్ 9న సోనియాగాంధీ జన్మదినం సందర్భంగా డిజిటల్ సభ్యత్వ నమోదు కార్యక్రమం ప్రారంభమైందన్నారు.

రాష్ట్ర వ్యాప్తంగా 34,765 పోలింగ్ బూతులున్నాయని, ఒక్కో బూతులో ఒక్కో ఎన్‌రోలర్‌ని కాంగ్రెస్ పార్టీ అమలు చేస్తోందన్నారు. ప్రతి బూతులో 100 మంది సభ్యులు సభ్వత్యం ఉండేలా చర్యలు తీసుకుంటోందన్నారు. రాష్ట్ర స్థాయిలో వేణుగోపాల దీపక్ జాన్‌లు కోఆర్డినేట్ చేస్తున్నారని తెలిపారు. ఏ వయస్సు వారికై నా సభ్యత్వం ఉంటుందని స్ప ష్టం చేశారు.