నిజామాబాద్ లో ఘనంగా ముక్కోటి ఏకాదశి వేడుకలు

భారీగా తరలివస్తున్న భక్తులు

నిజామాబాద్: నిజామాబాద్, కామారెడ్డి ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ముక్కోటి ఏకాదశి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. వైష్ణవ ఆలయాల వద్ద భక్తులు స్వామివారి దర్శనం కోసం తెల్లవారుజాము నుంచే   బారులు తీరారు. భక్తుల తాకిడితో నర్సింగ్ పల్లి, ముబారక్ నగర్, మామిడిపల్లి వెంకటేశ్వర స్వామి ఆలయాలు కిటకిటలాడుతున్నాయి. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి భక్తులు ఆలయాకు చేరుకుని తమ మొక్కులు చెల్లించుకుంటున్నారు. 

మునుపటి వ్యాసం