కరోనా పరిస్థితిపై సీఎంలతో ప్రధాని మోదీ సమీక్ష

ఆయా రాష్ట్రాల్లో పరిస్థితిపై చర్చ

న్యూదిల్లీ: కరోనా పరిస్థితులు, వ్యాక్సినేషన్‌పై ప్రధాని మోదీ గురువారం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమీక్షలో అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు ప్రధాని నరేంద్ర మోడీ వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్నారు. దేశంలో కరోనా, ఒమిక్రాన్ వేరియంట్ వేగంగా వ్యాప్తిస్తుండడంతో పరిస్థితిపై చర్చిస్తున్నారు. ఆయా రాష్ట్రాల్లో పరిస్థితిని సమీక్షిస్తున్నారు. సమావేశం తర్వాత కేంద్రం కొత్త మార్గదర్శకాలు విడుదల చేయవచ్చని భావిస్తున్నారు. ఇప్పటికే అనేక రాష్ట్రాలు కొవిడ్ నిబంధనలు కఠినంగా అమలు చేస్తున్నాయి. ప్రజలు భయాందోళనకు గురవుతున్న నేపథ్యంలో తాజా మార్గదర్శకాలు వెలువడే అవకాశం ఉంది.