యూపీ తొలి విడత ఎన్నికలకు భాజపా అభ్యర్థుల ఖరారు

బరిలోకి 172 మంది అభ్యర్థులు

న్యూదిల్లీ: ఉత్తర్ ప్రదేశ్‌లో తొలి దశ ఎన్నికల్లో భాగంగా భాజపా అభ్యర్థులను ఖరారు చేసింది. మొత్తం 172 అసెంబ్లీ స్థానాలకు భాజపా గురువారం అభ్యర్థులను ప్రకటించింది. ప్రస్తుతం శాసనమండలి సభ్యులుగా ఉన్న ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, ఉప ముఖ్యమంత్రి కేశవ్ ప్రసాద్ మౌర్యలను, మరో ఉప ముఖ్యమంత్రి దినేశ్ శర్మ, పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు స్వతంత్ర దేవ్ సింగ్‌ను కూడా పోటీలో నిలపాలని కమలం పార్టీ భావిస్తోంది.

రాష్ట్రంలో తొలి దశలలో జరగనున్న 172 అసెంబ్లీ స్థానాలపై విస్తృతంగా చర్చలు జరిపి పార్టీ అభ్యర్థులను భాజపా కేంద్ర ఎన్నికల కమిటీ ఖరారు చేసినట్లు ఉప ముఖ్యమంత్రి కేశవ్ ప్రసాద్ మౌర్య గురువారం మీడియాతో తెలిపారు. అయోధ్య నుంచి యోగి ఆదిత్యనాథ్, సిరథు నుంచి మౌర్య పోటీలో నిలిచే అవకాశం ఉంది. రాష్ట్ర రాజధాని లక్నోలోని ఒక నియోజకవర్గం నుంచి శర్మ పోటీ చేసే అవకాశం ఉంది.