గీత కార్మికుడికి ఆర్థిక సహాయం అందజేసిన వీర స్వామి గౌడ్

మానవత్వం చాటుకున్న పంతంగి వీర స్వామి గౌడ్

సూర్యాపేట: సూర్యాపేట జిల్లా కుడ కుడ చెందిన బూర రాములు గౌడ్ ప్రమాదవశాత్తు తాటి చెట్టు పైనుండి పడి తీవ్ర గాయాలై సూర్యాపేట జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. విషయం తెలుసుకున్న పంతంగి వీరస్వామి గౌడ్ సూర్యాపేట ప్రభుత్వ ఆసుపత్రికి చేరుకొని రాములు గౌడ్ ను పరామర్శించి ఆర్థిక సహాయం అందజేశారు. రాములు ఆరోగ్య పరిస్థితిని వైద్యులను అడిగి తెలుసుకుని మెరుగైన వైద్యం అందించాలని విజ్ఞప్తి చేశారు.

ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. ప్రభుత్వం కల్లుగీత వృత్తిదారులకు తాటి, ఈత చెట్లు ఎక్కేందుకు యంత్రాలను అందించాలని కోరారు. ఎంతోమంది గౌడ కల్లుగీత వృత్తిదారులు తాటి చెట్టు పైనుండి పడి మరణించారని ఆవేదన వ్యక్తం చేశారు. గౌడ కులస్తులు తమ కుటుంబాలను పోషించుకునేందుకు  కల్లుగీత వృత్తిపై ఆధారపడి బ్రతుకుతున్నారనీ చెప్పారు. ప్రభుత్వం స్పందించి వెంటనే కల్లుగీత వృత్తిదారులకు తాటి చెట్లు ఎక్కేందుకు యంత్రాలను అందించడంతోపాటు, మరణించిన వారి కుటుంబాలకు ఆర్థిక సాయం చెల్లించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ను విజ్ఞప్తి చేశారు.

ఆయన వెంట జై గౌడ సంక్షేమ సంఘం జిల్లా ఉపాధ్యక్షులు జలగం సత్యం గౌడ్, జిల్లా కార్యదర్శి కంభంపాటి అంజయ్య, జిల్లా సహాయ కార్యదర్శి అయితగాని మల్లయ్య గౌడ్, జిల్లా ప్రచార కార్యదర్శి బొమ్మగాని వెంకన్న గౌడ్, జిల్లా కల్లుగీత కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు పంతంగి దశరథ గౌడ్, జిల్లా నాయకులు రాపర్తి జానయ్య గౌడ్ తదితరులు  ఉన్నారు.


Subscribe

Subscribe to our newsletter to get the latest scoop right to your inbox

మునుపటి వ్యాసం