దిల్లీలో ఘోర అగ్ని ప్రమాదం..20 మంది మృతి

ప్రాణాలతో బయటపడ్డ 70 మంది

దిల్లీ: దిల్లీలో ఘోర అగ్ని ప్రమాదం సంభవించింది. పశ్చిమ దిల్లీలోని ఓ మూడు అంతస్తుల వాణిజ్య భవనంలో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో 20 మంది ప్రాణాలు కోల్పోగా పలువురికి తీవ్ర గాయాలు అయ్యాయి. దట్టమైన మంటలు భవనం మొత్తం వ్యాపించటంతో భారీ ప్రాణనష్టం జరిగినట్లు పోలీసులు తెలిపారు. దిల్లీలోని ముండ్కా మెట్రో స్టేషన్ సమీపంలో ఈ ఘటన జరిగింది.

విషయం తెలుసుకున్న అగ్ని మాపక సిబ్బంది 15 అగ్ని మాపక శకటాలతో మంటలు ఆర్పుతున్నారు. కాగా, ఇప్పటివరకు 70 మందిని ప్రాణాలతో రక్షించారు. ఈ ప్రమాదంలో దాదాపు 30 మందికి గాయాలైనట్లు సమాచారం. వాణిజ్య భవనంలో పలు సంస్థలు కార్యాలయాలు నిర్వహిస్తున్నట్లు డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ సమీర్ శర్మ వెల్లడించారు. ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. 

మునుపటి వ్యాసం