సీఎంగారు గౌరవం లేని ఆ మంత్రి పదవి నుంచి నన్ను తొలగించండి..

సీఎంగారు గౌరవం లేని ఆ మంత్రి పదవి నుంచి నన్ను తొలగించండి..

జైపూర్‌: సీఎం గాను వెంటనే మంత్రి పదవి నుంచి తనకు విముక్తి కల్పించండి. తన పరిధిలోని శాఖల్లో ఆ ఉన్నతాధికారి జోక్యం మితిమీరిపోయిందని, గౌరవం లేనిచోట తాను ఉండలేను అని ఓ మంత్రి.. సీఎంకు విజ్ఞప్తి చేశాడు. తన శాఖలన్నింటిని ఆ అధికారికే ఇచ్చేయండి అంటూ అసహనం వ్యక్తంచేశారు.

బండి ఎమ్మెల్యే అశోక్‌ చంద్నా (Ashok Chandna) రాజస్థాన్‌ సీఎం అశోక్‌ గెహ్లాట్‌ మంత్రివర్గంలో క్రీడలు, యువజన వ్యవహారాలు, స్కిల్‌ డెవలప్‌మెంట్‌, ఉపాధి, ఎంట్రప్రెన్యూర్‌షిప్‌, డిజాస్టర్‌ మేనేజ్‌మెంట్‌ అండ్‌ రిలీఫ్‌ శాఖల మంత్రిగా పనిచేస్తున్నారు. గత కొంతకాలంగా తన పరిధిలోని శాఖల్లో సీఎం ప్రిన్సిపల్‌ సెక్రెటరీ కుల్దీప్‌ రంకా జోక్యం మితిమీరిపోయింది. ఆ శాఖలన్నింటిని చూసే బాధ్యతలు ఆయనకే అప్పజెప్పండి. వెంటనే తనను ఆ గౌరవం లేని పదవి నుంచి తొలగించండి అని సీఎం గెహ్లాట్‌కు మంత్రి అశోక్‌ చందా ట్వీట్‌ చేశారు.

అధికారుల అతి, భూ దందాపై ఎమ్మెల్యే గణేశ్‌ గోర్గా ఆరోపణలు చేసిన కొన్ని రోజుల్లోనే ఏకంగా ఓ మంత్రి అసంతృప్తి వ్యక్తం చేయడం విశేషం.

దీంతో ఇప్పుడు ఇదికాస్తా రాజస్థాన్‌ రాజకీయాల్లో దుమారం రేపుతున్నది. గెహ్లాట్‌ ప్రభుత్వంపై ప్రతిపక్షాలు విరుచుకుపడుతున్నాయి. ఇది మునిగిపోయే పడవ.. పరిస్థితులు చూస్తే 2023కు ముందే అది జరిగేట్టు ఉందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సతీష్‌ పూనియా విమర్శలు గుప్పించారు.

courtesy:https://www.ntnews.com/national/rajasthan-minister-ashok-chandna-asks-cm-gehlot-to-relieve-him-from-dishonourable-post-601875


Subscribe

Subscribe to our newsletter to get the latest scoop right to your inbox