Medicines without Prescription: ఇకపై ఈ 16 మందులు డాక్టర్​ ప్రిస్క్రిప్షన్​ లేకున్నా కొనొచ్చు.. వివరాలివే..

డాక్టర్‌ మందుల చీటీ (ప్రిస్కిప్షన్‌) లేకుండా 16 రకాల మందులను ఔషధ దుకాణదారులు విక్రయించవచ్చని కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ స్పష్టం చేసింది.

డాక్టర్‌ (Doctor) మందుల చీటీ (ప్రిస్కిప్షన్‌) లేకుండా 16 రకాల మందులను (16 types of medicines) ఔషధ దుకాణదారులు విక్రయించవచ్చని కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ (Union Ministry of Health and Family Welfare) స్పష్టం చేసింది.  ఔషధ నియంత్రణ సంస్థ వద్ద విక్రయాలకు అనుమతి పొందిన దుకాణదారులే వీటిని అమ్మాలని స్పష్టం చేసింది. రోగి సమాచారాన్ని (Patient details) పూర్తిగా తెలుసుకొని, అర్హులైన ఫార్మాసిస్టులే ఈ ఔషధాలను ప్రిస్క్రిప్షన్​ లేకున్నా (Medicines without Prescription) ఇవ్వాలని సూచించింది. ఈ మందులను గరిష్ఠంగా అయిదు రోజుల వరకు వాడుకోవచ్చని, అప్పటికీ జబ్బు లక్షణాలు (Symptoms of the disease) తగ్గకపోతే వెంటనే వైద్యుడిని సంప్రదించాలని తెలిపింది. ఈ మేరకు గురువారం గెజిట్ నోటిఫికేషన్ ను కేంద్ర ఆరోగ్యశాఖ (Union Ministry of Health and Family Welfare)  విడుదల చేసింది.

వైద్యఖర్చులు కూడా ఆదా..

ఈ మందులను (Medicines) సొంతంగా వాడటం వల్ల హాని కలిగే అవకాశాల్లేవని, వైద్యఖర్చులు కూడా ఆదా చేసినట్లవుతుందని కేంద్ర ఆరోగ్యశాఖ  (Union Ministry of Health and Family Welfare)   తెలిపింది. అయితే ఏదైనా పరిమితికి మించి వాడడం మంచిది కాదనీ, నిర్దేశిత గడువులోగా తగ్గకపోతే వైద్యుడి సలహా (Doctor suggestion) పొందాల్సిందేనని స్పష్టం చేసింది. గతంలో ఉన్న నిబంధనలకు ఇది తాజా సవరణగా పేర్కొంది. దీనిపై అభ్యంతరాలుంటే (Doubts) వచ్చే నెల 25 లోగా కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖకు పంపించాలంది. వాటిని పరిశీలించాక తుది నిర్ణయం వెలడిస్తామని, అప్పటినుంచీ సవరణ ఉత్తర్వులు (Amendment orders) అమల్లోకి వస్తాయని వెల్లడించింది.

ప్రిస్క్రిప్షన్‌ (Prescription) అవసరం లేని మందుల జాబితా..

1) బిసాకొడిల్‌–5 ఎంజీ మాత్రలు (మలబద్దక నివారణ)  2) సోడియం క్లోరైడ్‌ నాజల్‌ స్ప్రే (ముక్కు దిబ్బడ నుంచి ఉపశమనం) 3) క్లోట్రిమాజోల్‌ క్రీం (యాంటీ ఫంగల్‌); 4) క్లోట్రిమాజోల్‌ డస్టింగ్‌ పౌడర్‌(యాంటీ ఫంగల్‌); 5) డెక్స్‌ట్రోమితార్పన్‌ హైడ్రోబ్రోమైడ్‌ లొంజెస్‌– 5 ఎంజీ (దగ్గు తగ్గేందుకు); 6) డైక్లోఫినాక్‌ క్రీమ్‌/ఆయింట్‌మెంట్‌/జెల్‌ (నొప్పి తగ్గించేందుకు); 7) డైఫెన్‌హైడ్రామైన్‌ కాప్సూ్యల్స్‌–25 ఎంజీ (యాంటీ అలెర్జిక్‌); 8) పారాసిటమాల్‌–500 ఎంజీ మాత్రలు; 9) క్లోరోహెక్సిడైన్‌ గ్లుకోనేట్‌– మౌత్‌ వాష్‌; 10) ఆక్సిమెటాజోలైన్‌ నాజల్‌ సొల్యూషన్‌ (ముక్కు దిబ్బడ నుంచి ఉపశమనం); 11) కీటొకోనాజోల్‌ షాంపూ (చుండ్రు నివారణ); 12) లాక్టులోస్‌ సొల్యూషన్‌ 10 గ్రా/15 ఎంల్‌ (మలబద్దక నివారణ); 13) బెంజోల్‌ పెరాక్సైడ్‌ (మొటిమల నివారణ); 14) కాలమైన్‌ లోషన్‌ (యాంటీ సెప్టిక్‌); 15) జైలోమిటాజోలైన్‌ హైడ్రోక్లోరైడ్‌ (ముక్కు దిబ్బడ తగ్గించేందుకు); 16) పొవిడోన్‌ అయోడిన్‌ – యాంటీ సెప్టిక్‌;

courtesy:https://telugu.news18.com/news/telangana/these-16-types-of-medicines-can-be-sold-by-drug-dealers-without-a-doctor-prescription-1313512.html


Subscribe

Subscribe to our newsletter to get the latest scoop right to your inbox